: 2014లో బీజేపీ ఓడిపోయిన నియోజక వర్గాల బాధ్యత ఇక రాజ్యసభ సభ్యులకే!


2014లో బీజేపీ ఓటమిపాలైన పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలను రాజ్యసభ ఎంపీలకు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించగా, బీజేపీ చీఫ్ అమిత్ షా ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు రంగంలోకి దిగారు. తదుపరి ఎన్నికల నాటికి విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిస్తూ, రాజ్యసభ సభ్యులుగా ఉండి మంత్రి పదవుల్లో ఉన్న 12 మంది ఎంపీలు సహా 52 మంది ప్రజా ప్రతినిధులకూ ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆయన అప్పగించారు. ఇక ఆ నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంటులో ప్రతినిధిగా ఉన్న విపక్ష పార్టీ నేతను ఇబ్బందుల్లో పెట్టేలా విమర్శించడం, లోపాలు ఎత్తి చూపడం, ప్రజలతో మమేకం కావడం వంటి పనుల్లో నిమగ్నం కావాలని, సాధ్యమైనన్ని ఎక్కువసార్లు ఆ నియోజకవర్గంలో పర్యటించాలని, అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లనూ చుట్టి, క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలాన్ని పెంచడంతో పాటు గెలుపు గుర్రాలను గుర్తించాలని అమిత్ షా సూచించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News