: డిజిటల్ ఇండియాకి రిలయన్స్ జియో ఊతమిస్తుంది, 4జీ స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకు అందిస్తాం: ముఖేష్ అంబాని
డిజిటల్ ఇండియా అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నినాదానికి రిలయన్స్ జియో ఊతమిస్తుందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ఈరోజు ముంబయిలో రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖేష్ అంబాని మాట్లాడుతూ... రిలయన్స్ జియో భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు. జియో అధునాతర ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) టెక్నాలజీని ఏర్పాటు చేస్తోందని అన్నారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ నెట్‌వర్క్‌గా జియో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విద్య, వ్యవసాయ రంగాలకు కూడా జియో ఉపయోగపడుతుందని ముఖేష్ అంబాని చెప్పారు. 4 జీ స్మార్ట్ ఫోన్లను అందుబాటు ధరకు అందిస్తామని చెప్పారు. ప్రపంచంలో అన్ని రంగాల్లో సమూల మార్పులు వస్తున్నాయని ఆయన అన్నారు. టెక్నాలజీ కొత్త శకానికి నాంది పలుకుతుందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో డిజిటల్ విప్లవం వస్తోందని చెప్పారు. 2017 కల్లా భారత్‌లోని మొబై ల్ ఇంటర్నెట్ వినియోగదారుల్లో 90 శాతం మందిని జియోతో అనుసంధానించేలా లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. జియోలో కాల్ డ్రాప్ సమస్యలు ఉండబోవని తెలిపారు.