: 13 ఏళ్ల పాలనకు ముగింపు... ప్రెసిడెంట్ దిల్మా రౌసెఫ్ ను అభిశంసించిన బ్రెజిల్ పార్లమెంటు


బ్రెజిల్ లో 13 ఏళ్లు సాగిన దిల్మా రౌసెఫ్ పాలనకు ఫుల్ స్టాప్ పడింది. ఆమెను పార్లమెంట్ అభిశంసించి పదవి నుంచి తొలగించింది. ఆమెను తొలగించాలంటూ తీసుకువచ్చిన తీర్మానం, ఓటింగ్ లో 61 - 20 తేడాతో విజయం సాధించగా, అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ రాజీనామా చేశారు. ఆ వెంటనే మాజీ ఉపాధ్యక్షుడు మైఖేల్ టీమర్ బ్రెజిల్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా 'బ్రిక్స్'లో స్థానం పొందిన బ్రెజిల్, ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగింది. పాలనాపరమైన లోపాలు, ప్రభుత్వ విధానాలే అందుకు కారణమని ఆరోపిస్తూ, అక్కడి సంకీర్ణ సర్కారు ఈ సంవత్సరం ఆరంభంలోనే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కాగా, రౌసెఫ్ తొలగింపును మోసపూరిత కుట్రగా అభివర్ణిస్తూ, ఈక్వెడార్, వెనిజులా, బొలీవియా తదితర దేశాలు బ్రెజిల్ నుంచి తమ రాయబారులను వెనక్కు పిలిపించుకున్నాయి.

  • Loading...

More Telugu News