: ఇదో ‘గుర్రం’ క్రేజీ!... రూ.1.11 కోట్లు పెట్టి అశ్వాన్ని కొన్న రాజస్థాన్ పారిశ్రామికవేత్త!
క్షణాల్లో కనుమరుగయ్యే వేగంతో దూసుకుపోయే కార్లు, బైకులంటే అమితంగా ఇష్టపడే వారిని చూశాం. ఇందుకోసం కోట్లకు కోట్లు వెచ్చించే ప్రముఖులను చూస్తున్నాం. అయితే రాజస్థాన్ కు చెందిన ఓ వ్యాపారి ఈ స్థాయిని ఎప్పుడో దాటేశారు. ప్రస్తుతం ఆయనకు ఈ మోటారు వాహనాలపై ఆసక్తి తగ్గిపోయింది. రాజసం ఒలకబోసే అశ్వాలపై ఆయన మనసు పారేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయన గారు ఏకంగా రూ. 1.11 కోట్లు వెచ్చించి ఓ గుర్రాన్ని కొనేశారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన సదరు వ్యాపారి ఇంత ఖరీదు పెట్టి కొనుగోలు చేసిన గుర్రం పేరు ‘ప్రభాత్’ అని జాతీయ మీడియా ఆసక్తికర కథనాలను రాసింది. బూడిద రంగులో ఉన్న సదరు గుర్రానిక సంబంధించి వీడియో కూడా నేషనల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.