: విశ్రాంతి కోసం కుటుంబ సమేతంగా గోవాకు వెళ్లనున్న చంద్రబాబు


ఇటీవలి కాలంలో నిత్యమూ పర్యటనలు, సమీక్షలతో తీవ్ర పని ఒత్తిడి మధ్య పాలనా పనులు సాగిస్తున్న చంద్రబాబు, రెండు రోజుల విశ్రాంతి నిమిత్తం గోవాకు వెళ్లనున్నారు. శనివారం నాడు కుటుంబంతో సహా గోవాకు వెళ్లే ఆయన, తిరిగి వినాయక చవితి పర్వదినం నాడు తిరిగి వస్తారని తెలుస్తోంది. గత రెండు రోజులుగా అనంతపురంలో పర్యటిస్తున్న ఆయన, కర్నూలు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు కూడా చేసొచ్చారు. నేడు కూడా అక్కడే గడపనున్న సంగతి తెలిసిందే. రాయలసీమ పర్యటన ముగియగానే చంద్రబాబు కుటుంబమంతా గోవాకు బయలుదేరనుంది.

  • Loading...

More Telugu News