: ఆంధ్రా యూనివర్సిటీ అక్రమాలపై మరో కమిటీ ఏర్పాటు
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ రాజు హయాంలో పీహెచ్ డీ ప్రవేశాలు, టీచింగ్ అసోసియేట్ ల నియామకాలు, ఇతర ఉద్యోగాల కల్పన సందర్భంగా యూనివర్శిటీలో చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో విశ్రాంత ఐఏఎస్ అధికారి వెంకటరమణ, ఏఎన్ మాజీ వీసీ రాఘవులు, రాయలసీమ వర్శిటీ ఉపకులపతి నర్సింహులును సభ్యులుగా నియమించింది. గతంలో ఏయూలో చోటుచేసుకున్న అవకతవకలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి, కేవలం 30 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఏయూలో మరోసారి ఆందోళన నెలకొంది. మాజీ వీసీ హయాంలో చోటుచేసుకున్న అడ్మిషన్లు, నియామకాల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే.