: మంత్రి సందీప్ కుమార్ పై వేటు వేసిన కేజ్రీవాల్
సహచర మంత్రి సందీప్ కుమార్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేటు వేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సందీప్ కుమార్ కు సంబంధించిన అభ్యంతరకర సీడీ బట్టబయలు కావడంతో ఆయనను తొలగించినట్టు ఆయన తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఎవరిపైనైనా ఇలాంటి చర్యలే తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ చర్యలు ఈ క్షణం నుంచి అమల్లోకి వస్తున్నాయని ఆయన ట్విట్టర్లోనే తెలిపారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని, అధికారం అడ్డుపెట్టుకుని ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటే సరికాదని ఆయన హెచ్చరించారు.