: ‘జనతా గ్యారేజ్’ సెట్స్ లో ప్రిన్స్ మహేష్ షూటింగ్


యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం రేపు విడుదల కానుంది. ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికే బెనిఫిట్ షోల కోసం వేచిచూస్తున్నారు. హైదరాబాద్ సారథి స్టూడియోస్ లో వేసిన సెట్ లో ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు, ఇదే సెట్ లో మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రిన్స్ మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్లు చిత్రీకరించనున్నారు. మొన్నటి వరకు ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో జరిగింది. తాజా షెడ్యూల్ లో భాగంగా యూనిట్ అంతా హైదరాబాద్ కు వచ్చింది. ఈ షెడ్యూల్ లో భాగంగానే మహేష్ బాబు చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇక్కడ తీయనున్నారు. అయితే, ఈ సెట్ లో కొద్దిగా మార్పులు చేశారట. ఒక పాట, ఒక ఫైట్ ఇక్కడ చిత్రీకరించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News