: మూడు రోజుల్లో తెలంగాణ గ్రూప్-2 నోటిఫికేషన్: టీఎస్ పీఎస్సీ చైర్మన్
తెలంగాణ గ్రూప్-2 నోటిఫికేషన్ రెండు మూడ్రోజుల్లో వెలువడనుంది. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఒక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. అనంతరం చక్రపాణి మీడియాతో మాట్లాడుతూ, పది రోజుల్లో గురుకుల విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మిగతా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు అందిన తర్వాత ప్రకటన చేస్తామన్నారు.