: 'జనతా గ్యారేజ్' అభిమానులపై మంచి ప్రభావం చూపుతుంది!: నిత్యా మీనన్
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఏదైనా విషయం చెబితే దానిపై మంచి ఇంపాక్ట్ ఉంటుందని సినీ నటి నిత్యామీనన్ తెలిపింది. 'జనతా గ్యారేజ్' ప్రమోషన్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ తో నటించడం ఆనందంగా ఉందని చెప్పింది. ముంబైలో తమ మధ్య తొలిషాట్ చిత్రీకరణ జరిగిందని, ఈ సందర్భంగా డైలాగ్ చెప్పడానికి ముందు...'నేను నీ అభిమానిని, నువ్వు బాగా నటిస్తావ'ని జూనియర్ ఎన్టీఆర్ కితాబునిచ్చాడని గుర్తు చేసుకుంది. దీంతో తమ మధ్య మంచి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందని తెలిపింది. ఇది సినిమాలో సులువుగా నటించేందుకు ఉపయోగపడిందని నిత్యా తెలిపింది. ఈ సినిమా అభిమానులపై మంచి ప్రభావం చూపుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది. దీనికి కారణం కొరటాల శివ రూపొందించిన కథ అని చెప్పింది. కొరటాల శివ కథ, కథనం ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయని చెప్పింది. ఎలాంటి అంశాన్నైనా సరళంగా చెప్పడంలో కొరటాల శివది ప్రత్యేకశైలి అని నిత్యామీనన్ తెలిపింది.