: ‘త్రైవ్ ఎనర్జీ టెక్నాలజీస్’ డైరెక్టర్ గౌతం కుమార్ రెడ్డి అదృశ్యం
త్రైవ్ ఎనర్జీ టెక్నాలజీస్ కంపెనీ డైరెక్టర్ గౌతం కుమార్ రెడ్డి అదృశ్యమయ్యారు. గత సోమవారం కెన్యా నుంచి తన భార్యతో కలిసి ఆయన హైదరాబాద్ కు వచ్చారు. ఈ సంఘటనపై ఆయన కుటుంబసభ్యులు మాట్లాడుతూ, గౌతం కుమార్ రెడ్డి కి ఆర్థిక ఇబ్బందులున్నాయని, మానసిక ఒత్తిడిలో ఉన్నారని చెప్పారు. గత జనవరిలో వివాహం చేసుకున్నాడని, ఎనిమిదేళ్లుగా కెన్యాలో పనిచేస్తున్నాడని చెప్పారు. కాగా, గౌతం కుమార్ రెడ్డి అదృశ్యంపై ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.