: ఏదో విధంగా చంద్రబాబును ఓటుకు నోటు కేసులో ఇరికించాలన్నది వైసీపీ కుట్ర: సోమిరెడ్డి ఫైర్
ఏదో విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఓటుకు నోటు కేసులో ఇరికించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబుకు ఆ కేసుతో సంబంధం లేదని అన్నారు. ఆయనను ఈ కేసులో ముద్దాయిగా చేయడానికి వైసీపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. వైసీపీ ఓ నేరస్తుల సమూహమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుని ముద్దాయిని చేయడం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్లే కాలేదని సోమిరెడ్డి అన్నారు. కాపుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు కుట్ర చేస్తున్నాయని ఆ పార్టీలు ఆడుతోన్న ఆటలో కాపు నేత ముద్రగడ పావుగా మారారని ఆయన వ్యాఖ్యానించారు.