: చించోలిలో చిరుత పులల సంచారం.. భయాందోళనల్లో గ్రామస్తులు
ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలం చించోలిలో చిరుత పులులు సంచరిస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో చిరుతలు తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారులకు స్థానికులు తెలియజేశారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు చిరుతల కాలి అడుగులను గుర్తించారు. చించోలిలో చిరుతలు ఎక్కడ ఉన్నాయన్న అంశంపై అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. చిరుతల కాలి అడుగుల గుర్తుల ద్వారా వాటిని గాలిస్తున్నట్లు తెలుస్తోంది. చిరుతలు తమపై ఎక్కడ దాడి చేస్తాయోనని గ్రామస్తులు భయపడుతున్నారు.