: హైదరాబాద్ అనుపమ హాస్టల్ లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని అనుపమ హాస్టల్ లో ఉంటున్న బీటెక్ విద్యార్థి నవీన్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్ నగర్ పోలీసులు ఈ కేసు వివరాలు తెలిపారు. యూట్యూబ్ లో ఆత్మహత్య చేసుకునే పద్ధతులను శోధించి మరీ ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కుటుంబసభ్యుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నవీన్ కుమార్ సూసైడ్ నోట్ రాశాడని పోలీసులు చెప్పారు. నవీన్ కుమార్ ను నల్గొండ జిల్లా మోత్కూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.