: సింగూరు భూసేకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు.. వెయ్యి ఎకరాల భూమిని రైతులకు తిరిగిచ్చేయాలని ఆదేశాలు
పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం అధికారంలో ఉన్న 2006 సంవత్సరంలో టాటా మోటార్స్ కంపెనీతో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. నానో కార్ల తయారీ కోసం సింగూరులో వెయ్యి ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఒప్పందం చేసుకొని భూసేకరణ చేపట్టింది. అయితే దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు భూసేకరణ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని పేర్కొంది. భూమిని 12 వారాల్లోగా రైతులకు తిరిగి ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, రైతులు తీసుకున్న పరిహారాన్ని తిరిగి చెల్లించనక్కర్లేదని చెప్పింది.