: రంగారెడ్డి జిల్లా కోర్టులో లొంగిపోయిన నయీమ్ ప్రధాన అనుచరుడు శ్రీహరి
గ్యాంగ్ స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు శ్రీహరి రంగారెడ్డి జిల్లా కోర్టులో లొంగిపోయాడు. నయీమ్ కు మరో ప్రధాన అనుచరుడైన సామ సంజీవరెడ్డితో కలిసి పదిహేను సంవత్సరాలుగా భూదందాలు, సెటిల్మెంట్లకు శ్రీహరి పాల్పడ్డాడు. నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం శ్రీహరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈరోజు కోర్టులో లొంగిపోయిన శ్రీహరి కొన్ని సీడీలను మీడియాకు అందజేశాడు. శ్రీహరిని హైదరాబాద్ లోని సైదాబాద్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, సామ సంజీవరెడ్డిని నిన్న రాత్రి సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.