: శునకాలు మనిషి భాషతో పాటు స్వరాన్ని కూడా అంచనా వేస్తాయట.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడి!


మనిషి మ‌చ్చిక చేసుకునే జంతువుల్లో శునకాలకు ఎంత ప్రాధాన్య‌త ఉందో తెలిసిందే. శున‌కాన్ని ఒక మిత్రుడిలా చూసుకునే వారు ఎందరో ఉన్నారు. వాటితో ఆడుకుంటూ ఒత్తిడిని కూడా త‌గ్గించుకుంటారు. అలాంటి శున‌కాలు మ‌నం చేసే సంజ్ఞ‌ల‌ను ఎలా ప‌ట్టేస్తాయ‌న్న అంశంపై హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో ‘ఎట్వోస్‌ లోరాండ్‌’ విశ్వవిద్యాలయం శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేశారు. అనంత‌రం ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలను తెలిపారు. మాగ్నెటిక్‌ రిజోనెన్స్‌ ఇమేజింగ్‌ ద్వారా వాటిపై పరిశోధన చేసినట్లు వారు పేర్కొన్నారు. వాటితో మ‌నిషి ఎంత ఆప్యాయంగా ఉంటాడో శున‌కాలు కూడా మ‌నిషిపై వివిధ రకాలైన భావోద్వేగాలను ప్రదర్శిస్తుంటాయ‌ని వారు తెలిపారు. మ‌నిషి త‌న‌ దిన‌చ‌ర్య‌లో భాగంగా శున‌కాల‌తో గడిపే క్షణాలను, మ‌నిషి ప‌లికే భాషను అవి అర్థం చేసుకోడానికి అధికంగా ప్ర‌య‌త్నిస్తాయ‌ని పేర్కొన్నారు. మ‌నిషి ప‌లికే భాషే కాకుండా స్వరాన్ని సైతం అంచనా వేస్తాయని తెలిపారు. మ‌నిషి మాట్లాడుతుండ‌గా అత‌డి స్వరంలోని సారూప్యత ద్వారా మనిషి మానస్థిక స్థితి ఆ స‌మ‌యంలో ఎలా ఉందో అంచ‌నా వేస్తాయ‌ని చెప్పారు. శున‌కాల మెదడుపై చేసిన‌ పరిశోధనల్లో ఈ అంశం తేలింద‌ని పేర్కొన్నారు. శున‌కాల‌తో నెమ్మదిగా మాట్లాడడం, శబ్దంతో కూడిన సంభాషణ చేయడం వంటి ప్రయోగం చేసిన శాస్త్ర‌వేత్త‌లు ఈ రెండింట్లో అవి ప్రదర్శించే తీరు మనిషిలానే ఉంద‌ని తేలింద‌ని చెప్పారు. దీంతో అవి మనుషులకేం తీసిపోవని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు. శున‌కాల‌ మెదడులో మ‌న‌లాగే అర్థం చేసుకునే భాగాల ప్రేరేపణ కూడా ఉంటుంద‌ని తెలిపారు. మ‌నిషి ఎలా ప్రవర్తిస్తాడో కుక్క‌లూ అలానే ప్ర‌వ‌ర్తిస్తాయ‌ని, అందుకే మ‌న‌కి శునకాల వల్ల ఒత్తిడి దూర‌మ‌య్యే అనుభూతి క‌లుగుతుంద‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News