: భారీ వర్షాలకు ప్రాణనష్టంపై కేసీఆర్ విచారం
భారీ వర్షాలకు రామంతాపూర్ లో నలుగురు, బోలక్ పూర్ లో ముగ్గురు వ్యక్తులు చనిపోయిన సంఘటనపై సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. భారీ వర్ష సూచన ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. విద్యుత్, డ్రైనేజ్, రహదారులు, మ్యాన్ హోల్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో పరిస్థితులపై మంత్రి కేటీఆర్, సీఎస్ రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్లని అడిగి తెలుసుకుంటానన్నారు. సహాయకచర్యల్లో అధికార యంత్రాంగమంతా పాల్గొనాలని కేసీఆర్ ఆదేశించారు.