: మృతులకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్
హైదరాబాద్‌లో వర్షం సృష్టించిన బీభత్సంపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ మీడియాతో మాట్లాడారు. మల్కాజ్‌గిరి, ఫీవర్ ఆసుపత్రి ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా ఉందని, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఖైరతాబాద్ దగ్గర ట్రాఫిక్ కొంత క్లియర్ అయిందని ఆయన పేర్కొన్నారు. వర్షాల కారణంగా నగరంలో ఇప్పటి వరకు ఏడుగురు చనిపోయారని, మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు తెలిపారు. నగరంలో ఇప్పటికే చాలా పాత భవనాలను కూల్చేశామని, పురాతన భవనాల్లో ఉన్నవారిని కార్పొరేటర్లు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని బొంతు రామ్మోహన్ సూచించారు. ఇంకా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు సిబ్బంది రంగంలోకి దిగారని చెప్పారు.