: చంద్రబాబు ఆకస్మిక పర్యటనతో డిప్యూటీ కేఈ, మంత్రి అచ్చెన్నాయుడు ఉరుకులు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లాలో ఆకస్మిక పర్యటనకు నిర్ణయించుకున్న వేళ మంత్రులు, అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఈ మధ్యాహ్నం పత్తికొండ మండలం దూదేకొండలో పంటల పరిస్థితిని సమీక్షించాలని సీఎం నిర్ణయించుకున్నట్టు ఉదయం 10 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు సమాచారం అందింది. ఆ వెంటనే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడులు హడావుడిగా సీఎం పర్యటించనున్న ప్రాంతానికి బయలుదేరారు. చంద్రబాబు దూదేకొండకు వచ్చేలోగా అక్కడికి వెళ్లి ఏర్పాట్లు చూడనున్నట్టు కేఈ తెలిపారు.