: కర్నూలు జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన కుందూ నది


నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లాలో కుందూ నది ఉగ్రరూపం దాల్చింది. వరదనీరు 10 గ్రామాలను చుట్టుముట్టగా, ఈ గ్రామాలన్నింటికీ రాకపోకలు నిలిచిపోయాయి. పెదముడియం మండలం నెమళ్లదిన్నె దగ్గర కాజ్ వే పై మూడు అడుగుల మేరకు నది నీరు పొంగి ప్రవహిస్తోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల నీరు నదిలో ప్రవహిస్తున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News