: పవన్ తిరుపతి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ శత్రువులు పెరుగుతారని హెచ్చరించిన అమిత్ షా


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే విషయంలో ఒక్కో రోజు అలస్యమయ్యే కొద్దీ శత్రువులు పెరుగుతారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హెచ్చరించారు. నిన్న అరుణ్ జైట్లీ, వెంకయ్యలతో సమావేశమైన అమిత్ షా, ఇటీవలి తిరుపతి సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆలస్యం చేస్తే మిత్రులుగా ఉన్నవారు రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలో శత్రువులుగా మారుతారని, దానివల్ల వ్యతిరేకులను పెంచుకోవడం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. పవన్ వంటి బీజేపీ మిత్రులను దూరం చేసుకునే పరిస్థితిని తీసుకురానివ్వబోమని ఆయన అన్న తరువాతనే రాష్ట్రానికి హోదా, ప్యాకేజీలపై ముసాయిదా తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News