: ఏపీకి వరాలిస్తే ఇతర రాష్ట్రాల నుంచి రాజకీయ సమస్యలు తప్పవు... అయినా బీ రెడీ: అమిత్ షా


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని కేంద్రం నిర్ణయించిన వేళ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా కొన్ని వరాలను ప్రకటిస్తే, ఇతర రాష్ట్రాల నుంచి రాజకీయ సమస్యలు వస్తాయని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది. మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఏపీ పరిస్థితిని వివరిస్తూ, వారికి సర్దిచెప్పే మార్గాలను అన్వేషించాలని జైట్లీ, వెంకయ్యనాయుడులకు షా సూచించినట్టు తెలిసింది. కాగా, కేంద్ర మంత్రి సుజనా తయారు చేసిన ముసాయిదాపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన తరువాత తుదిరూపు ఇచ్చి బహిర్గతపరచాలని కేంద్రం భావిస్తోంది.

  • Loading...

More Telugu News