: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం... 8 మంది దుర్మరణం


హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా మేడ్చల్ టోల్‌గేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టోల్‌ చెల్లించేందుకు లారీ వెనుక ఆగి ఉన్న టవేరా వాహనాన్ని వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. దీంతో లారీ, డీసీఎం మధ్య టవేరా నలిగిపోయి నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా 8 మంది దుర్మరణం పాలయ్యారు. అబ్బాస్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులంతా మెదక్ జిల్లా సదాశివపేటకు చెందినవారు. మృతులను ఎండీ అఖిల్, ఇమ్రోజ్, ఇర్ఫాన్, షెకావత్, సమీర్, ఫైరోజ్, నిషాద్, అక్బర్‌లుగా గుర్తించారు. కొంపల్లిలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News