: అధిక మొత్తంలో బయటపడుతున్న నల్లధనం


దేశంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏడు నెలల్లోనే భారీగా నల్లధనం బయటపడింది. రూ.330 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. ఈసారి ఆదాయపు పన్ను శాఖ రికార్డు స్థాయిలో దాడులకు పాల్పడిందని చెప్పారు. గత ఏడాది జనవరి నుంచి జులై మధ్య కాలంలో 55 దాడులు చేయగా, ఈ ఏడాదిలో ఇప్పటికే 148 దాడులు చేశామన్నారు. గత ఏడాది రూ.102.50 కోట్లు మాత్రమే దాడుల్లో దొరికాయని, దీంతో పోలిస్తే ఈ ఏడాది మూడు రెట్లు ఎక్కువ నల్లధనం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు, నగలను స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపన్ను శాఖాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News