: సిట్ అదుపులో నయీమ్ ప్రధాన అనుచరుడు సామ సంజీవరెడ్డి
గ్యాంగ్ స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు సామ సంజీవరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ పటాన్ చెరువులోని ఒక హోటల్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం సంజీవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నయీమ్ వేల కోట్ల రూపాయల ఆస్తి విషయంలో సామ సంజీవరెడ్డి బినామీగా ఉన్నాడు.