: యూఎన్-విమెన్ ఇండియా విభాగానికి ఐశ్వర్య ఎంపికపై రజనీకాంత్ వెరీ హ్యాపీ


యూఎన్-విమెన్ విభాగానికి ప్రత్యేక సలహాదారుగా తన కూతురు ఐశ్వర్య ఎంపిక కావడంపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. భారత్ లో సమానత్వం, మహిళా సాధికారత కోసం యూఎన్- విమెన్ ఇండియాతో కలిసి పనిచేసేందుకు ఐశ్వర్యను ఎంపిక చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని రజనీ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రస్తుతం దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో సీక్వెల్ ‘2.0’లో రజనీ నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News