: పుష్పగుచ్ఛాలతో వచ్చిన ప్రజాప్రతినిధులకు సీఎం చురకలు


కరవు పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజా ప్రతినిధులకు ఆయన చురకలంటించారు. అనంతపురం జిల్లా గణపతిపల్లిలో చంద్రబాబు పర్యటించారు. ‘రైతులను పరామర్శించడానికి వస్తే పుష్పగుచ్ఛాలతో స్వాగతమా?’ అంటూ చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటువంటి సందర్భాల్లో పుష్పగుచ్ఛాలెందుకు తేవడమన్నారు. అనంతరం రైతు పొలంలో ఉండి ట్యాబ్ ద్వారా జీపీఎస్ లో పంటను పరిశీలించారు. పంట 50 శాతం ఎండిపోయినట్లు జీపీఎస్ ద్వారా ఆయన గుర్తించారు.

  • Loading...

More Telugu News