: ప్రపంచం మారింది.. ఆ మార్పులో మనం కూడా ఉంటే బాగుంటుందనిపించింది: జూనియర్ ఎన్టీఆర్


‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాల వరకు మామూలుగానే ఉండేవాడిని. ఆ తర్వాతే నేను మారాలి అనుకున్నాను... అన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘సినిమా పద్ధతులు మారాయి. వరల్డ్ వైడ్ సినిమా మారిపోయింది. మనం కూడా మారాలి అనుకున్నాను. ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’ వరకు మామూలుగానే ఉండేవాడిని. ప్రపంచమంతా మారింది కాబట్టి, ఆ మార్పులో మనం కూడా ఉంటే బాగుంటుందనిపించింది. అందుకే, ఫిల్మ్ చేసేటప్పుడు యాక్టింగే కాకుండా, మన లుక్ కూడా మారితే ఇంకా బాగుంటుందనిపించింది. పాత్రకు తగ్గట్టుగా ఆ కథానాయకుడు ఉండాలి. అందుకే, అలా చేయడం కరెక్టు అనిపించి నా లుక్ మార్చాను’ అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు.

  • Loading...

More Telugu News