: ఆప్ దృష్టి ఢిల్లీ అభివృద్ధిపై లేదు... ప్రధాని మోదీపైనే ఉంది: కేంద్రమంత్రి హర్షవర్ధన్
ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీపై కేంద్రమంత్రి హర్షవర్ధన్ విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రధాని మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకుందని, ఢిల్లీ అభివృద్ధిపై దృష్టిసారించడం లేదని అన్నారు. ఢిల్లీ నగరంతో పాటు రాష్ట్రంలోని ఎన్నో ప్రాంతాలు ఉదయం పూట శుభ్రంగా ఉండి, మధ్యాహ్నానికి మురికిగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. రహదారుల శుభ్రత విషయంలో ప్రజలు తమ వైఖరిని మార్చుకోవాలని, ప్రజలు వాటి శుభ్రత మున్సిపాలిటీ వారి బాధ్యతగా మాత్రమే భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ వచ్చి ప్రయత్నిస్తేనే దేనిలోనైనా విజయం సాధించొచ్చని హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలో లేకపోవడమే ఓ సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ సర్కారు ఇతరులను విమర్శిస్తూ మీడియా దృష్టిలో పడాలని చూస్తుందని, మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకుందని ఆయన అన్నారు.