: 1న వెలగపూడి సచివాలయంలో తొలి సమావేశం
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో వచ్చే నెల 1వ తేదీన తొలి అధికారిక సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం కానుంది. అనంతరం ఆర్థిక శాఖపై యనమల రామకృష్ణుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించనున్న మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం, ఆర్థిక శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలు సచివాలయంలో తొలి అధికారిక భేటీలుగా రికార్డులకెక్కనున్నాయి. కాగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సచివాలయంలో మంత్రుల ఛాంబర్లు, శాఖల ప్రారంభోత్సవాలు దాదాపు పూర్తయ్యాయి.