: పనన్ కల్యాణ్ కు 'సంపూ'ర్ణ మద్దతు తెలుపుతూ లేఖ!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సినీ నటుడు సంపూర్ణేష్ బాబు ఒక లేఖ రాశాడు. ఏపీకి ప్రత్యేకహోదా పై మాట్లాడిన పవన్ కు తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని సంపూ పేర్కొన్నాడు. ‘నేను తెలంగాణలో పుట్టాను. నా సోదర తెలుగు రాష్ట్ర ప్రజలు ఇంత కష్టాల్లో ఉన్నారని, వారి గుండెల్లో ఇంత ఆగ్రహం ఉందని పవన్ కల్యాణ్ గారి స్పీచ్ ద్వారా తెలిసి గుండె బరువెక్కింది. రాష్ట్రాలు వేరైనా, కష్టం వచ్చినప్పుడు అందరం ఒక్కటే, సీమాంధ్రుల బాధను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడికి ఉంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు. వారు కొంటున్న సినీమా టిక్కెట్ డబ్బుతోనే మనం బతుకుతున్నాం. పవన్ కల్యాణ్ గారి ఉద్యమంలో నేను ఒక గొంతుకనవుతాను. దీనివల్ల ఏ ఉపయోగమూ జరగకపోవచ్చు. కానీ, నా వల్ల మరొకరు ధైర్యంగా ముందుకు రావొచ్చుగా’ అంటూ సంపూ ఆ లేఖలో రాశారు.