: ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై అమిత్ షా, జైట్లీ, వెంకయ్య, సుజనా భేటీ.. గంటన్నర పాటు కొనసాగిన సమావేశం
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక హోదా కోసం వస్తోన్న డిమాండ్ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు పలువురు కేంద్రమంత్రులతో రాష్ట్ర వ్యవహారాలపై కీలక చర్చలు జరిపారు. ఏపీలోని పరిస్థితులను గురించి అమిత్ షా మంత్రులతో సమగ్రస్థాయిలో చర్చించారు. ఢిల్లీలో అమిత్ షా నివాసంలో ఈ సమావేశం గంటన్నర పాటు కొనసాగింది. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరికాసేపట్లో ఈ సమావేశంపై కేంద్ర మంత్రులు మీడియాకు వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.