: ఇదేం న్యాయం బాబాయ్?: కేసీఆర్ ను ప్రశ్నించిన అన్న కూతురు రమ్య


తన ఆస్తులపై దాడులు జరుగుతుంటే, అదే విషయాన్ని నలుగురికీ తెలియజెప్పేందుకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను అరెస్ట్ చేయించడం ఎంత వరకూ సబబని సీఎం కేసీఆర్ అన్న కుమార్తె, కాంగ్రెస్ మహిళా నేత రమ్య ప్రశ్నించారు. ఈ ఉదయం గన్ పార్క్ వద్ద ధర్నాకు దిగిన ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు గాంధీనగర్ పోలీసు స్టేషన్ కు తరలించగా, ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే బొడిగ శోభ అరాచకాలు పెరిగిపోయాయని, ఆమెను అరెస్ట్ చేసే వరకూ ఉద్యమిస్తానని చెప్పిన రమ్య, రాష్ట్రంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు ఓ న్యాయం, ప్రజా ప్రతినిధులకు మరో న్యాయం జరుగుతోందని, ఇదెక్కడి న్యాయమని అడిగారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రమ్య వెంట పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News