: కేజ్రీవాల్ మాదిరిగానే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సైతం 420: సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ
ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి, తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన వంచకుడని, తన అభిప్రాయం ప్రకారం నజీబ్‌జంగ్ నిర్వర్తిస్తోన్న పదవికి సరిపోరని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌లాగే లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఒక 420 అని ఆయన అన్నాడు. ఆయన నిర్వర్తిస్తోన్న బాధ్యతలలో సంఘ్ పరివార్ వ్యక్తిని నియమించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు.