: దేవినేని, కుమారుడు అవినాష్, జిల్లా అధ్యక్షుడు కడియాలపై కాంగ్రెస్ బహిష్కరణ వేటు


తెలుగుదేశం పార్టీలోకి ‘జంప్’ అవుతున్న విజయవాడకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూపై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. దేవినేనితో పాటు ఆయన కుమారుడు, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవినాష్, కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబుపై కూడా పార్టీ వేటు తప్పలేదు. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈరోజు ఒక ప్రకటన చేశారు. కాగా, నెహ్రూ, కుమారుడు అనినాష్ ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబును కలిశారు. తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది టీడీపీయే అని, తన పుట్టింటికి వచ్చినట్లుగా ఉందని ఈ సందర్భంగా దేవినేని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News