: చెత్తను తొలగించడానికి వరద నీటిలో దిగిన నంద్యాల కౌన్సిలర్... తృటిలో ప్రాణాపాయం తప్పింది!
కర్నూలు జిల్లా నంద్యాలలో పొంగి ప్రవహిస్తున్న చామ కాలువకు అడ్డుగా ఉన్న చెత్తను తొలగించే ఉద్దేశంతో సాహసంతో దిగిన 24వ వార్డు కౌన్సిలర్ దిలీప్ కుమార్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. చెత్తను తొలగించే క్రమంలో ఓ తాడు పట్టుకుని నీటిలోకి దిగిన ఆయన ప్రవాహ ఉద్ధృతికి కొంత దూరం కొట్టుకుపోయారు. చూస్తున్న వారంతా హాహాకారాలు చేస్తుంటే, కొంతదూరంలోని ఓ చెట్టును ఆయన పట్టుకున్నాడు. ఆపై చుట్టుపక్కల వారు స్పందించి నిచ్చెన సాయంతో దిలీప్ ను బయటకు తీసుకుని వచ్చారు. ఆ చెట్టు చేతికి దొరక్కుంటే నీటి ప్రవాహానికి తన ప్రాణాలు పోయుండేవని బయటకు వచ్చిన అనంతరం దిలీప్ వ్యాఖ్యానించారు.