: పిల్లలు వీధుల్లో కాదు, విద్యాల‌యాల్లో మాత్ర‌మే వుండాలి!: జమ్ముకశ్మీర్‌ సీఎం


జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాదులు సృష్టిస్తోన్న అల‌జ‌డిని గురించి ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మెహబూబా ముఫ్తీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పిల్లలు వీధుల్లో ఉండ‌కూడ‌ద‌ని, వారు విద్యాల‌యాల్లో మాత్ర‌మే ఉండాల‌ని ఆమె చెప్పారు. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్‌కోసం మాత్ర‌మే పాటు ప‌డాల‌ని సూచించారు. చేతుల్లో రాళ్లను తీసుకొని విసరడం భావ్యం కాద‌ని వ్యాఖ్యానించారు. పిల్లలు, యువ‌కులు త‌మ భ‌విష్య‌త్తుకి బాట‌లు వేసే విద్య‌పైనే త‌మ‌ దృష్టి పెట్టాల‌ని ముఫ్తీ అన్నారు. జ‌మ్ముక‌శ్మీర్‌లో విద్యారంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అవ‌స‌ర‌మైన నిధులు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకొని విద్యా రంగాన్ని పటిష్టం చేయనున్న‌ట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News