: దాసరి ఇంట్లో భేటీ అయిన ముద్రగడ, చిరంజీవి, అంబటి, బొత్స
ఏపీలో కాపులకు రిజర్వేషన్ల కోసం పోరు బాట పట్టిన కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తమ డిమాండ్లను సాధించుకోవడానికి హైదరాబాద్‌లో పలువురు నేతల మద్దతు కూడ గట్టడానికి ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. హైదరాబాద్‌లోని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఇంట్లో ఈరోజు ఆయన పలువురు కాపు ప్రముఖులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేత, సినీనటుడు చిరంజీవి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణలతో పాటు పలువురు నేతలు భేటీకి హాజరయ్యారు. కాపులకు రిజర్వేషన్లు, భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చలు కొనసాగిస్తున్నారు. .