: మరో వివాదంలో చిక్కుకున్న సనాఖాన్ ప్రియుడు


నటుడు కల్యాణ్ రామ్ తో 'కత్తి' సినిమాలో జత కట్టిన సనా ఖాన్ గుర్తుందిగా. ఆమె ప్రియుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో మీడియా కన్సల్టెంట్ ను బెదిరించిన కేసులో అరెస్టైన వీరిద్దరూ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే తాజాగా సనా ఖాన్ ప్రియుడు ఇస్మాయిల్ ఖాన్ తాను ఉంటున్న అపార్ట్ మెంట్ లో సీసీ కెమెరాలు అమర్చడంతో అపార్ట్ మెంట్ లోని ఇతర నివాసిత మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారని అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అతనికి సీసీ కెమెరాలు తీసేయాలని తాము నోటీసులు ఇచ్చామని, అయితే వాటికి స్పందించడం లేదని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని వారు తెలిపారు. అయితే తన భద్రత కోసం సీసీ కెమెరాలు అమర్చానని, 2011లో తన కారును ఎవరో కావాలని డ్యామేజ్ చేశారని, దీంతో తాను సీసీ కెమెరాలు అమర్చుకున్నానని ఆయన తెలిపారు. సీసీ కెమెరాలు అమర్చేందుకు తీసుకున్న పర్మిషన్ లేఖను చూపించాలని పోలీసులు ఆయనను కోరారు. 'బిగ్ బాస్' రియాలిటీ షోతో సల్మాన్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న సనా ఖాన్ ఆ తరువాత సల్మాన్ తో 'జై హో'లో నటించింది. అది ఫ్లాప్ అయినా సల్మాన్ సిఫారసుతో పలు సినిమాల్లో పాత్రలు దక్కించుకుందని బాలీవుడ్ లో టాక్ నడిచింది.

  • Loading...

More Telugu News