: మోదీకి నవాజ్ షరీఫ్ బంధువా?...అద్వానీ జిన్నాను పొగడవచ్చా?: సిద్ధరామయ్య


ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ బంధువా? అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ, ఎవరికీ చెప్పకుండా, అధికారిక షెడ్యూల్ ఖరారు కాకుండా నేరుగా ఆయన ఇంట శుభకార్యానికి హాజరైతే తప్పులేదా?...నటి రమ్య పాకిస్థాన్ నరకం కాదంటే వివాదమా? అని ప్రశ్నించారు. గతంలో బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను పొగిడినప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు ఎందుకు విమర్శించలేదని ఆయన నిలదీశారు. చవకబారు రాజకీయాల్లో భాగంగా రమ్య వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ నేతలు వివాదం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమ్నెస్టీ వివాదంలో దేశవ్యతిరేక నినాదాలు చేసినట్టు రుజువులు లభ్యం కాలేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News