: మరో వివాదంలో పాప్ స్టార్ జస్టిన్ బీబర్


పాప్ స్టార్ జస్టిన్ బీబర్ మరోవివాదం రేపాడు. పాప్ స్టార్ గా ఆవిర్భవించిన నాటి నుంచి జస్టిన్ బీబర్ వివాదాలతో సావాసం చేయడం మొదలుపెట్టాడు. మాజీ గర్ల్ ఫ్రెండ్ సెలెనా గోమెజ్ తో డేటింగ్ చేస్తున్నప్పుడు పోలీసులు అరెస్టు చేసి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమెతో విడిపోయిన తరువాత బ్రెజిల్ లో వేశ్యగృహంలో పట్టుబడి అభిమానులను అవాక్కయ్యేలా చేశాడు. దీంతో అభిమానులు నిలదీయడంతో వారిపై చేయిచేసుకున్నాడు కూడా. తాజాగా సోఫియా రీచీతో డేటింగ్ చేస్తున్న జస్టిన్ బీబర్ ఆమెతో బీచ్ లో సరసాల్లో మునిగి ఉన్న ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశాడు. వీటిని చూసిన అభిమానులు షాక్ కు గురయ్యారు. ఒంటిపై నూలుపోగు లేకుండా నిస్సిగ్గుగా ఉన్న వీరిని చూసి అభిమానులు ఇన్ స్టా గ్రామ్ కు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆ ఫోటోలను డిలీట్ చేశాడు. తాజాగా తన ఖాతాను నిలిపేశాడు.

  • Loading...

More Telugu News