: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... జీఎస్‌టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జీఎస్టీ బిల్లును ఆమోదం తెలపడమే లక్ష్యంగా తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ఈరోజు కొనసాగనున్నాయి. శాసనసభలో సీఎం కేసీఆర్ జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జీఎస్‌టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఈ పన్ను విధానాన్ని 150కి పైగా దేశాలు అనుసరిస్తున్నాయని ఆయన అన్నారు. దీని వల్ల దేశానికి లాభం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పన్నుల ఎగవేతను తగ్గించడానికే కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చిందని వివరించారు. యూపీఏ హయాంనుంచి ఈ బిల్లును తీసుకురావాలని చూశారని, బిల్లుపై చర్చోపచర్చలు జరిగాయని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో ఓ అవగాహనకొచ్చిన తరువాత జీఎస్‌టీ లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందిందని అన్నారు. పార్టీలకు అతీతంగా ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాలు దీనిని ఆమోదించాయని పేర్కొన్నారు. బిల్లుని ఆమోదించిన పదో రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని పేర్కొన్నారు.