: టీటీడీ కల్యాణకట్ట మేస్త్రీ ఇంట రూ. 1.25 కోట్లు, కిలోన్నర బంగారం


ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలపై టీటీడీ కల్యాణకట్టలో మేస్త్రిగా పనిచేస్తున్న తంగవేలు ఇంట్లో సోదాలు జరిపిన అవినీతి నిరోధక శాఖ అధికారులు అవాక్కయ్యే వాస్తవాలను బయటపెట్టారు. కొర్లకుంటలోని తంగవేలు ఇంట్లో సహా, ఆయన సమీప బంధువుల ఇళ్లలో ఉదయం నుంచి సోదాలు జరుగుతుండగా, ఇప్పటివరకూ రూ. 1.25 కోట్ల విలువైన నగదు, ఆస్తి పత్రాలు, కిలోన్నరకు పైగా బంగారం పట్టుబడినట్టు అధికారులు తెలిపారు. తంగవేలు బినామీల పేరిట కూడా భారీఎత్తున ఆస్తులను కూడబెట్టినట్టు అధికారులు తేల్చారు. తమ సోదాల్లో మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశముందని, ఇదంతా అక్రమ సంపాదనేనని, విషయాన్ని టీటీడీ అధికారులకు వివరిస్తామని అ.ని.శా పేర్కొంది.

  • Loading...

More Telugu News