: ఉసేన్ బోల్ట్ గొడ్డు మాంసం తింటాడా? తినడా?


జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ డైట్ పై బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ చేసిన ట్వీట్ పెద్ద చర్చకు కారణమైంది. భోజనంలో బోల్ట్ ఏం తినాలో నిర్ణయించే డైటీషియన్ కూడా అంత చర్చించి ఉంటారో ఉండరో కానీ భారతీయ నెటిజన్లు మాత్రం బోల్ట్ ఏం తింటాడన్న విషయంపై చర్చించారు. 'గొడ్డు మాంసం తింటాడా? అందుకే అంతలా పరుగెడతాడు' అని కొందరంటే... మరి కొంత మంది అసలు బోల్ట్ గొడ్డుమాంసమన్నదే తినలేదని అన్నారు. ఇలా రకరకాలుగా బోల్ట్ ఏం తింటాడన్న దానిపై చర్చించుకున్నారు. అయితే బోల్ట్ వాస్తవానికి ఏం తీసుకుంటాడన్న దానిపై వివరాలు ఆరాతీయగా...ఉదయం ఎగ్ శాండ్విచ్...మధ్యాహ్నం పాస్తాతో గొడ్డు మాంసం...రాత్రి జమైకన్ కుడుములు, రోస్టెడ్ (కాల్చిన) చికెన్ బ్రెస్ట్ తీసుకుంటాడు. రోజంతా పైనాపిల్, యాపిల్, మామిడి పండ్లు తీసుకుంటాడని తెలుస్తోంది. స్పోర్ట్స్ పర్సన్ కాకముందు జమైకన్లు తీసుకునే అన్నం, చేపలు తినేవాడని, మూడేళ్ల క్రితం డైట్ పై శ్రద్ధ చూపిస్తుండడంతో ఏం తినాలి? ఎంత తినాలి? అన్న విషయాలు పట్టించుకుంటున్నానని ఉసేన్ బోల్ట్ చెప్పాడు.

  • Loading...

More Telugu News