: సెప్టెంబర్ రెండో వారంలో ముహూర్తం: దేవినేని నెహ్రూ


కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకుని ఈ ఉదయం సీఎం చంద్రబాబుతో ప్రత్యేక చర్చలు జరిపిన దేవినేని నెహ్రూ, ఆయన తనయుడు అవినాష్ లు సెప్టెంబర్ రెండో వారంలో పార్టీలో అధికారికంగా చేరనున్నట్టు ప్రకటించారు. మరో పది రోజుల్లో టీడీపీలో చేరుతామని చంద్రబాబుకు స్పష్టం చేసిన దేవినేని, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు వెల్లడించారు. చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని, రాష్ట్రం కోసం ఆయన పడుతున్న కష్టానికి తనవంతు తోడ్పాటును అందిస్తానని తెలిపారు. తన అనుయాయులు, కార్యకర్తలతో చర్చించిన తరువాతే కాంగ్రెస్ పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు దేవినేని పేర్కొన్నారు. దేవినేనిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు కళా వెంకట్రావు తెలిపారు.

  • Loading...

More Telugu News