: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి తీవ్ర అస్వస్థత
హిందూ ఆధ్యాత్మిక గురువు, కంచి కామకోటి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బంది పడుతుంటే, గమనించిన శిష్యులు ఆయన్ను సూర్యారావు పేటలోని ఆంధ్రా ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం హాస్పిటల్ ఐసీయూలో ఆయనకు అత్యవసర చికిత్స జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఐదుగురు వైద్యుల బృందం పర్యవేక్షణలో స్వామి పరిస్థితిని సమీక్షించి వైద్యం అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. జయేంద్ర సరస్వతి ఆరోగ్యంపై కాసేపట్లో ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం.