: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రెండేళ్ల చిన్నారి పాట.. నాలుగు రోజుల్లో 3.7 మిలియన్ల వ్యూస్!
అమెరికాలోని లూసియానాకు చెందిన రెండేళ్ల చిన్నారి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. బాలిక ప్రతిభ చూస్తే ఎవరైనా ముగ్ధులైపోవాల్సిందే. ఆంగ్ల అక్షరాలు ఏబీసీడీ.. లతో కూర్చిన పాటను పాడిన ఈ చిన్నారి ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఇటువంటి పాటను తాము ఇప్పటి వరకు ఎక్కడా వినలేదని నెటిజన్లు చెబుతున్నారు. ఈ సాంగ్‌ను ఆగస్టు 26న చిన్నారి తల్లి క్రిస్టినీ ఓగీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. నాలుగు రోజుల్లోనే 3.7 మిలియన్ల మందికిపైగా ఈ వీడియోను వీక్షించారు. చిన్నారి పాటను చూసిన ప్రతి ఒక్కరు పాపను అభినందిస్తున్నారు.