: పోప్‌ను కలిసిన ఫేస్‌బుక్ సీఈవో దంపతులు.. ఫేస్‌బుక్ డ్రోన్‌ను బహుమానంగా ఇచ్చిన జుకర్‌బర్గ్


ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన సతీమణి ప్రిస్కిల్లాతో కలిసి వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశారు. ఈ విషయాన్ని వాటికన్ అధికార ప్రతినిధి గ్రెగ్ బుర్కె ధ్రువీకరించారు. సోమవారం పోప్‌ను కలిసిన జుకర్‌బర్ పలు విషయాలపై ఆయనతో చర్చించినట్టు తెలిపారు. ముఖ్యంగా పేదరికం తొలగించడానికి కమ్యూనికేషన్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించవచ్చనే అంశాలపై చర్చించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జుకర్‌బర్గ్ మాట్లాడుతూ ఇంటర్నెట్ లేకుండానే ప్రజల మధ్య కమ్యూనికేషన్ జరగడంపై చర్చించినట్టు తెలిపారు. సోలార్‌తో పనిచేసే అక్విల్లా మోడల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను (డ్రోన్) పోప్‌కు బహుమానంగా ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో ఇది ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుందని వివరించారు.

  • Loading...

More Telugu News