: నేడు ఏపీ మంత్రుల అనంత పర్యటన, రెయిన్ గన్ ల పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు మంత్రులు పలు నియోజకవర్గాల్లో పర్యటించి రెయిన్ గన్ ల పనితీరును పరీక్షించనున్నారు. అనంతపురం జిల్లాలోని అనంతపురం, ధర్మవరం నియోజకవర్గాల్లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు; తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో మంత్రి పీతల సుజాత; పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో మంత్రి పరిటాల సునీత; హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లో మంత్రి రావెల కిశోర్ బాబు పర్యటించి రెయిన్ గన్ ల పనితీరును పరీక్షిస్తారు.